7 నెలలు మంచి రోజులు లేవట కదండీ

కొత్త సంవత్సరంలో 7 నెలలు శుభ ముహుర్తాలు లేవు అంటున్నారు నిజమేనా ?

నమస్కారం , వేదాంత్ పూజ సేవలకు స్వాగతం.నిజమే కొత్త సంవత్సరంలో (క్రోధి నామ సం.) లో ముహుర్తాలు తక్కువ ఉన్నాయి.

అయితే వరుసగా 7 నెలలు కాదు , సంవత్సరం మొత్తం మీద సుమారు 7 నెలలు లేవు.

ఏ ఏ నెలలు బాగున్నాయో ఈ క్రింద చూడవచ్చు.

ఉగాది పండుగ  09.04.2024 మంగళవారం అవుతుంది సహజంగా ఉగాది నుండి వరుసగా అంటే చైత్ర , వైశాఖ , జ్యేష్ఠ మాసాలలో వివాహ , గృహప్రవేశ సుముహూర్తాలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో సుముహూర్తాలు ఉండవు (శూన్య మాసం కాబట్టి)

 

అయితే

ఈ సంవత్సరంలో గురు,శుక్ర మౌఢ్యమి కారణంగా చైత్ర మాసంలో ” 27.04.2024 నుండి ” ఆషాఢమాసం ప్రారంభం వరకు ” 07.07.2024 వరకు ” సుముహూర్తాలు లేవు.

ఆ తర్వాత ఆషాఢమాసం వస్తుంది.

ఆషాఢమాసం శూన్య మాసం కారణంగా “04.08.2024 వరకు” ససుముహూర్తాలు ఉండవు.

05.08.2024 నుండి శ్రావణ మాసంలో సుముహూర్తాలు ప్రారంభం అవుతాయి 02.09.2024 వరకు సుముహూర్తాలు ఉంటాయి.

మళ్లీ భాద్రమాసం శూన్య మాసం కారణంగా 02.10.2024 వరకు ససుముహూర్తాలు ఉండవు.

03.10.2024 నుండి వరుసగా ఆశ్వీయుజ , కార్తీక ,

మార్గశిర మాసాల్లో అనగా 30.12.2024 వరకు సుముహూర్తాలు ఉంటాయి.

 

ఆ తర్వాత పుష్యమాసం కారణంగా 30.12.2024 నుండి 

01.02.2024 వరకు సుముహూర్తాలు ఉండవు.

 

ఆ తర్వాత మాఘమాసంలో నెల రోజులు ఉన్నాయి

ఫాల్గుణ మాసంలో శుక్ర మౌఢ్యమి కారణంగా ముహూర్తాలు ఉండవు.

ఆ తర్వాత ఇక ఉగాది పండుగ.

From Karishye to Arpanamasthu.

Chimmapudi vedanth puja services


Comments

Leave a Reply

Discover more from Vedanth Puja Services

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading