మీరు దేవతార్చన చేయండి.

భారతీయ సనాతన జీవన విధానంలో దేవతార్చన అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది
ముఖ్యంగా గృహస్థాశ్రమ జీవితంలో ఉన్న వాళ్లకు అత్యంత ముఖ్యమైనది దేవతార్చన ఒక గృహస్థు ప్రతిరోజు ఉదయాన్నే నిత్య సంధ్యావందనం తర్వాత దేవతార్చన తప్పక చేసుకోవాలి
భారతీయ సనాతన జీవన విధానంలో చెప్పబడినటువంటి ఆశ్రమధర్మాలలో బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత గృహస్థాశ్రమ ధర్మం చాలా కీలకమైనది
నాలుగు ఆశ్రమ ధర్మాలలో గృహస్థాశ్రమ ధర్మం చాలా ఉత్కృష్టమైనదని మహర్షులు చెప్పారు.
యదార్ధంగా నేటి కాలంలో కూడా గృహస్థులపైన అత్యధిక బాధ్యత ఉంది
ప్రత్యక్షంగా , పరోక్షంగాను గృహస్తులు అధికంగా బరువు బాధ్యతలను మరియు సమాజంలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు
కాబట్టి వారి నిత్య రోజు వారి జీవనంలో భాగంగా వారు దైవ బలాన్ని పొందేందుకు నిత్య దేవతార్చన తప్పనిసరిగా చేసుకోవాలి మిగిలిన ఆశ్రమ ధర్మాలలో ఉన్న వారికి కూడా దేవతార్చనలు, జప, మంత్ర అనుస్థానాలు ఉన్నప్పటికీ గృహస్థుల విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ధర్మాలను మహర్షులు చెప్పారు అందులో దేవతార్చన కూడా ఒకటి.
శ్రీ శంకర భగవత్పాదుల వారు పంచాయతన దేవతార్చన విధానాన్ని మనందరికీ అందించారు .

శివ పంచాయతనం అభిషేక సమయం.

దేవతార్చనలు
శివ పంచాయతనం
గణపతి పంచాయతనం
శక్తి పంచాయతనం
సూర్య పంచాతనం
విష్ణు పంచాయతనం
అని ఐదు విధములైన పంచాయతన దేవతా అర్చన విధానాలు ఉన్నాయి వీటిలో వారి వారి యొక్క పూర్వీకుల ఆచరణ,ఆచారములను అనుసరించి వారు తగినటువంటి దేవతా అర్చన నిత్యము చేయవలసి ఉంటుంది.
ఈ యొక్క దేవతార్చన విధానంలో ప్రతిరోజు అభిషేకాదులు, అష్టోత్తర శతనామావళి పూజలు, మహానైవేద్యములు వంటి షోడశోపచార పూజలు యధాశక్తిగా చేయవలసి ఉంటుంది.
కానీ ప్రస్తుత కాల పరిస్థితులను అనుసరించి ఒక పురోహితుడు దేవతార్చన చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఆలయాలలో అర్చకులు గా పని చేస్తున్న వారికి కాస్త వెసులుబాటు ఉన్నప్పటికీ పురోహితులకు చాలా సంక్లిష్టంగా ఉన్నది. “ఇది యదార్థం” రోజు ఇంట్లో బాధ్యతలు నిత్య కృత్యాలు తల్లితండ్రిని చూసుకోవడం భార్య పిల్లలు అన్ని పనులు పూర్తి చేసుకుని రోజూ కార్యక్రమానికి బయలుదేరవలసి ఉంటుంది.
మహానగరాలలో ట్రాఫిక్ సమస్య చాలా ఉధృతంగా ఉంటుంది.
పురోహితులు సమయానికి చేరుకోవాలి అని చాలా వేగంగా వాహనము నడపవలసి వస్తుంది ముందు బయలుదేరుదామంటే ఇంట్లో పనులు దేవతార్చన మిగిలినటువంటి నిత్య కృత్యాలు ఇవన్నీ పూర్తి చేసుకొని బయలుదేరేందుకు సమయం సరిపోదు.
ఒకవేళ దేవతార్చన తరువాత చేసుకుందాము అని త్వరగా బయలుదేరి కార్యక్రమానికి వెళ్ళినట్లయితే మనసులో ఒక ఆలోచన అలా ఉండిపోతుంది “ఈ రోజు ఇంకా దేవతార్చన చేయలేదు” అని ఒకవేళ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చాక దేవతార్చన చేద్దాము అనుకుంటే అప్పటికి ఓపిక ఉండదు.
ఇక నేటి కాలంలో గ్యాస్ ట్రబుల్ విషయం అందరికీ తెలిసినదే ఏమీ తినకుండా దేవతార్చన చేయాలి అని ఉదయాన్నే ఫలహారం కూడా చేయకుండా సమయం అవుతోంది అని త్వర త్వరగా కార్యక్రమానికి వెళ్లి కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకుని మళ్ళీ తిరిగి వచ్చి అప్పుడు స్నానం చేసి దేవతార్చన చేసుకొని భోజనం చేసే అప్పటికి మూడున్నర నాలుగు అవుతుంది.

ఉదయం నుండి ఏమి తినకుండా నాలుగు గంటలకు భోజనం చేస్తే మీకు అనారోగ్యము గ్యాస్ ట్రబుల్ తప్పదు పంతులుగారు అని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు నొక్కి వక్కానిస్తున్నారు.
మరి ఇలాంటి సమయంలో ఎంత ప్రయత్నించిన తెల్లవారుజామున రెండున్నరకు మేలుకుంటే కానీ అనుకున్న విధంగా దేవతార్చన మహా నైవేద్యము,నిత్య విధులను పూర్తి చేసుకొని కార్యక్రమానికి వెళ్లలేక పోతున్నాము.
ఇది ఒక పురోహితుడు నిత్య జీవితంలో జరిగే విషయం నమస్కారం,ఆదరణతో చదివినందుకు ధన్యవాదములు.

~ Ch pavan sastry

శివాయ గురవే నమః

Comments

One response to “మీరు దేవతార్చన చేయండి.”

  1. […] మీరు దేవతార్చన చేయండి. […]

Leave a Reply

Discover more from Vedanth Puja Services

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading