గత కొన్ని నెలలుగా నా వలన కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను
Phone calls answer చేయలేక పోవడానికి కారణాలు పరిశీలన చేద్దాము.
ఏదైనా చెప్పుకుంటే తీరుతుంది అంటారు
ఈ విషయం మీతో పంచుకుంటాను
పురోహితం అనేది ఉద్యోగస్థుల లాగా కాదు
ఒక నిర్ణీత సమయం అనేది ఉండదు.
ఉద్యోగస్థుల లాగా 9 to 5 job కాదు.
• రాత్రి ముహూర్తాలు , తెల్లవారుఝాము ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి అన్ని సమయాల్లో ఫోన్ తీయలేక పోవచ్చు.
• దూర ప్రయాణాలు ఉంటాయి,
ప్రతి కార్యక్రమానికి వెళ్లడం ఒక గంట తిరుగు ప్రయాణం ఒక గంట అవుతుంది.
ప్రయాణంలో (వాహనం నడుపుతూ )
ఫోన్ మాట్లాడలేను.
మరి దగ్గర ప్రాంతాల్లో పూజలు ఒప్పుకోవచ్చుకదా అంటే
నిజంగా చెప్పాలంటే “గడవదు”.
ఎందుకంటే పూజలు ఎప్పుడూ ఉండవు
కేవలం మంచిరోజుల్లోనే ఉంటాయి.
ఆ మంచి రోజులు సంవత్సరం మొత్తం ఉండవు, కేవలం 6 నుండి 7 నెలలు ఉంటాయి.
కాబట్టి ఆ సమయంలోనే నిద్రాహారాలు మానుకొని పనిచేయాలి.
ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ..

• కనీసం మెసేజ్ అయినా చేయవచ్చు కదా?
ఇది ఆచరిస్తున్నాను.
తప్పకుండా మెసేజ్ చేస్తాను.
• ఇంటికి వెళ్లాక call back చేయవచ్చు కదా ?
చేయవచ్చు కానీ రోజు ఇంటికి వెళ్లేప్పుటికీ రాత్రి 10 దాటుతుంది. ఆ తర్వాత ఫోన్ చేసి అవతల వారిని ఇబ్బంది పెట్టకూడదు అని చేయడం లేదు.
• మొత్తంమీద మీరు చాల busy ఫోన్ కూడా answer చేయలేను అంటున్నారా?
కానే కాదు. నేను చాల ఖాళీగా ఉంటాను.
కేవలం ముహూర్తాల రోజుల్లో మాత్రమే అందరూ ఒకేసారి calls చేస్తారు, ఎందుకంటే మంచిరోజులు కాబట్టి.
మరి ఆ సమయం లో అందరికీ సమాధానం త్వరగా చెప్పాలంటే చాల కష్టంగా ఉంటుంది. చాల సందర్భాల్లో భోజనం చేస్తుంటే తప్పక ఫోన్స్ answer చేసి భోజనం చేసే సమయం లేక చేయి కడుకున్న రోజులు ఉన్నాయి.
కానీ ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం వెతికాను.
chimmapudivedanthpujaservices.in
Website ద్వార చాల సులువుగా అందరికీ సమాధానం చెప్పవచ్చు.
• అందరికీ Answer చేయడానికి ఎంత సమయం పడుతుంది ?
సుమారు 1 గంట పడుతుంది , ఎందుకంటే
ముహూర్తాలు చెప్పడం అంత తేలిక విషయం కాదు.
ఎన్నో విషయాలను పరిగణ చేయాల్సి ఉంటుంది. అన్నీ పరిశీలించి సుముహూర్తాలను పంపాలంటే సుమారు గంట పడుతుంది. కానీ ఇప్పుడు చాల సులువు కేవలం కొన్ని seconds లో ముహూర్తాలు చూసి పంపవచ్చు.
ఇదంతా ఈ website పుణ్యం.
✍️ Chimmapudi pavan sastry.

Leave a Reply