ముందు దక్షిణేశ్వరం తర్వాత అరుణాచలం మనో యాత్ర

అమ్మ అనుగ్రహంతో 11 రోజులు కుంభాభిషేకం లో పాల్గొనే అవకాశం లభించింది.

ముచుకుంద నది తీరంలో వలిగొండ లో వేంచేసి ఉన్న నవ ఆలయాల సముదాయంలో జగదాంబ త్రిశక్తి స్వరూపిణిగా సర్వజీవులను కరుణతో కాపాడుతుంది.

అమ్మదయతో ఈ కుంభాభిషేకంలో పాల్గొని తరించాము.

రోజు వారి దినచర్య లో భాగంగా రాత్రి 07.30 గంటలకు అన్ని కార్యక్రమాలు ముగించుకుని

భోజనానికి శ్రీమాత అన్నప్రసాద శాల కు చేరుకునే వారము. అమృత తుల్యమైన ప్రసాదాన్ని భుజించి వసతి ప్రాంగణానికి చేరుకునే వాళ్ళము.

చక్కగా చర్చ గోష్ఠి ప్రారంభం అవుతుంది.ఆ గోష్ఠి లో మా గురువుగారు శ్రీ || భగవతి హరికుమార శర్మ గారు మరియు మా గురువుగారి శిష్యులు + మిత్రులు మరొకరు ఉండేవారు.

సరస్వతి అమ్మవారు 🙏

ఇక శిష్యులు అడిగిన ప్రశ్నలకు ప్రమాణములతో సంశయ నివృత్తి చేసి స్వానుభవంలో లభించిన విషయాలను కూడా అందించేవారు.

అలా శిష్యుడు అడిగిన ప్రతి ప్రశ్న లేదా సందేహ తాలూకా భావాన్ని గురువుగారు నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అన్ని సందేహాలను , ప్రశ్నలను నివృత్తి చేస్తూ జగన్మాత పాదాల చెంత విలీనం చేసేవారు గురువుగారు.

అలా గురువుగారి సమాధాన సమన్వయ భావాలతో దక్షిణేశ్వరం కాళిక అమ్మవారి దేవాలయం వెళ్ళేవాళ్ళం అలా వెళ్లగానే మా గురువుగారి మిత్రులు వెంటనే పదండి అరుణాచలం వెళ్దాము అని శిష్యులు అడిగిన ప్రశ్నకు రమణుల వలె సమాధానం చెప్పేవారు.అంటే సముద్రం లో ఉన్న జలం మళ్లీ నదులు గా ఎలా మారుతాయో అలా మారకుండా ఉండటానికి ఎలా ఆలోచించాలో వీరు చెప్పేవారు.

అలా రెండు యాత్రలు పూర్తి చేసుకునే వారలము.

ఏదైనా అమ్మదయతోనే ప్రాప్తం.

గురువాక్యం. 🙏


Comments

Leave a Reply

Discover more from Vedanth Puja Services

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading